వైభవ్ సూర్యవంశీ. 14ఏళ్ల వయస్సులో గుజరాత్ టైటాన్స్ పై అద్భుతమైన సెంచరీ కొట్టిన తర్వాత నుంచి ఈ పేరు మారు మోగిపోతోంది. అసలు 14ఏళ్లకు ఐపీఎల్ ఆడటమే ఓ సంచలనం. అలాంటిది ఓ చిన్న కుర్రాడు ఈ స్థాయిలో పెను విధ్వంసం సృష్టించటం అనేది మాటలకు అందనిది. అసలు ఈ అబ్బాయి రాజస్థాన్ కి ఎలా దొరికాడు అనేది ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ. బిహార్ కి చెందిన సూర్యవంశీ 8వ తరగతి చదువుతున్నాడు. చాలా చిన్న ఏజ్ అంటే దాదాపుగా 5ఏళ్ల వయస్సు నుంచే టోర్నమెంటులు ఆడటం మొదలు పెట్టాడట సూర్యవంశీ. అలాంటి రఘువంశీని బ్రజేశ్ ఝా అనే కోచ్ గమనించటంతో సూర్యవంశీ కెరీర్ మలుపు తిరిగింది. కానీ వయస్సు బాగా తక్కువ కావటంతో తనను పెద్దగా కన్సిడర్ చేసే వాళ్లు కాదు ఎవ్వరూ. ఇది కోచ్ కి కోపం తెప్పించింది. టీమ్ ఇండియాకు అండర్ 19 ఆడే టైమ్ కి వైభవ్ వయస్సు కేవలం 13ఏళ్లే కావటంతో ఆ నెక్ట్స్ లెవల్ కి వెళ్లటానికి చాలా ఇబ్బందులు ఎదురువుతుంటే నేషనల్ క్రికెట్ అకాడమీ ఛైర్మన్ గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ దృష్టికి తీసుకువెళ్లారట కోచ్ బ్రజేష్ ఝా. సర్ మీరు వయస్సు చూడండి ఓ సారి పిల్లాడి టాలెంట్ చూడండి తన దగ్గరున్న వైభవ్ సూర్యవంశీ ఆడిన వీడియోలు అన్నీ చూపించాడటం. ఇంప్రెస్ అయిపోయిన లక్ష్మణ్ NCA అండర్ 19 మ్యాచ్ ల్లో వైభవ్ ఆడిన వీడియోలు తెప్పించుకుని తన టీమ్ తో కలిసి పరిశీలించారట. ఇంప్రెసివ్. ఆ పిల్లాడి వయస్సుకు ఆటకు సంబంధం లేదు. ఇప్పటి కప్పుడు రంజీలు ఆడించినా టీమిండియాలోకి రావటానికి రెండు మూడేళ్లు సమయం పట్టొచ్చు. అందుకే ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు లక్ష్మణ్ కు ఐపీఎల్ గుర్తొచ్చింది. ముందుగా తనకు బాగా సంబంధాలున్న సన్ రైజర్స్ తో మాట్లాడారంట లక్ష్మణ్. బట్ సూర్యవంశీ ఆడే ఓపెనర్ స్థానంలో తమకు ట్రావియెస్ హెడ్, అభిషేక్ శర్మలను మార్చే ఉద్దేశం లేకపోవటంతో లైట్ తీసుకున్నారట. దీంతో తన ఫ్రెండ్ సహచర ఆటగాడు లెజెండ్ అయిన రాహుల్ ద్రవిడ్ దృష్టికి తీసుకువెళ్లి ఐపీఎల్ ఆక్షన్ లో తన మీద దృష్టి పెట్టాలని చెప్పారట. లక్ష్మణ్ పంపిన వైభవ్ సూర్యవంశీ వీడియోలు చూసి ఆశ్చర్యపోయిన ద్రవిడ్ ఆక్షన్ లో 13ఏళ్ల పిల్లాడికి కోటి పదిలక్షల రూపాయలు పెట్టి మరీ కొనుక్కుని అప్పుడే అందర్నీ ఆశ్చర్యపరిచారు. మూడు నెలలుగా తనకు కాలు బాగోకపోయినా వీల్ ఛైర్ లోనే కూర్చుని మరీ వైభవ్ ను ట్రైన్ చేశారు ద్రవిడ్. ఇంటర్నేషనల్ బౌలర్లను ఎదుర్కోవాలంటే కావాల్సింది స్కిల్ తో పాటు గుండె ధైర్యం. అదే ఆ పిల్లాడికి నూరి పోశారు. ఆ కాన్ఫిడెన్సే తను ఎదుర్కొన్న మొదటి బంతినే వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్ గా మలిచి తనొచ్చానని చాటి చెప్పాడు. మూడో మ్యాచ్ లో 11 భారీ సిక్సర్లు, 7 ఫోర్లతో 35 బంతుల్లోనే సెంచరీ బాదేసి ఫాసెస్ట్ సెంచరీ చేసిన యంగెస్ట్ బ్యాటర్ గా..ఫాస్టెస్ట్ సెంచరీ బై ఇండియన్ బ్యాటర్ గా ఇలా లెక్కలేనని రికార్డులు నెలకొల్పాడు వైభవ్ సూర్యవంశీ. అలా లక్ష్మణ్ వెతికి పట్టి సపోర్ట్ చేసిన విధ్వంసం..రాహుల్ ద్రవిడ్ ట్రైనింగ్ లో వజ్రాయుధంలా మారి నిన్న గుజరాత్ మీద ప్రళయమే సృష్టించింది.